18, ఏప్రిల్ 2012, బుధవారం

శ్రీరామకొటి - అసిధారావ్రతము.


శ్రీరామనామము మన జాతీయజీవనాడికి ఒక ఇంధనము.రామమందిరము లేని వూరు వాడ వుండదు ఆంటే అతిశయోక్తికాదు రాముని మనలొ ఆంతలానిలుపుకున్నాము.ఉత్తమపురుషలక్షణాలయిన 24 కలవాడు,16 కళా ప్రపూర్ణుడని ఉత్తరాదివారు మర్యాదపురుషొత్తం శ్రీరాము అని పలుకుతారు.మన స్త్రిమూర్తులకు ఆదర్శనీయుడు.గ్రుహస్తులకు,ఆచారవంతులకు శ్రీరాముని పిత్రువాక్యపరిపాలన,కర్తవ్యనిష్ట,ధర్మనిరతి,సొదరప్రేమ,మిత్రరక్షణ ఒకటేమిటి,
ఇలా ఆయనను ఆదర్శముగా తీసుకొని తమజీవనవిధానము నడుపుతున్నవారునేటికి కొకొల్లలు.శ్రిరాముని పై తమతమ భాషలలొ రామాయణాలు,కావ్యాలు,గేయాలు,కీర్తనలు  రచించి పండితులు తరించిపొయారు.ఇక కళాకారులు సరేసరి.మరి పామరులకు మాత్రము ఇవిఎమి తెలవదు ' రాములోరు ' మాదేవుడు అంతే. శ్రీరాముడు సచ్చిదానందస్వరూపుడు అన్నది జగద్విఖ్యాతము.మరి అందుకే రామనామము తారకమంత్రమయినది.రామదాసు తారకమంత్రము కోరిన దోరికేను ...అన్నా ,త్యాగారాజు భక్తితో అన్ని కీర్తనలు ఆలాపించి రామనామము లొ రమించి తరించారు.కానీ సామాన్యులకు శ్రీరామకొటి లేఖనము భవ తారకము.

ఇంతటివిశిష్టమయిన శ్రీరామకొటి నామలేఖనాన్ని ఒకవ్యక్తి   కొరినవారందరికి ఉచితముగా ఇస్తూ ఒక ఆసిధారవ్రతములా చేస్తున్న వ్యక్తి పేరు "శ్రీ వూటుకూరి రామయ్య గారు" ఊరు మార్కాపురం,కస్తురిబాయి వీధి.
ఆర్థికముగా భారమయిన ఈరొజులలొ 50పై ల పొస్ట్ కార్ద్ వ్రాస్తె చాలు మీ ఇంట్లొ శ్రీరామకొటి లేఖనాగ్రంథము ప్రత్యక్షము.అది పూర్తి ఉచితముగా.వీరుమనకు పుస్తకము పంపి వూరుకొనరు మనపేరున ఒక ఖాత ప్రారంభించి మనతాలుకు రామకొటి గ్రంథాల రాక, మనము వ్రాసినతరువాత ఎప్పుడు చేరినది నమోదు చేస్తారు. ఎవరన్న గ్రంథానికి ధరకాని,ఆర్థికసహాయానికి నిధులుకాని పంపుతామన్న ససేమిరా అంగీకరించరు.మీరు ఆనిధులను మీవద్దవున్న మీఇష్టదైవాలకు,మందిరాలకు,ధర్మకార్యాలకు వినియొగించండి నాకు వొద్దు అంటారు.
వీరు 1933లొ జననము.చిన్నతనము నుండి అధ్యాత్మికత అంటేఅభిమానము.విరు మంత్రదిక్ష పొంది నేటికి సాధనలొనే వున్నారు.వీరు కుండలని సాధకులు.ఆఙ్ఞాచక్రము వరకు సాధన చేసి ఆరొగ్యము సహకరించక విరమించినారు.వీరు వి.అర్.ఎజెన్సిస్ పేరున 18సం.ల క్రితము వరకు వ్యాపరము చేసినారు. వీరికి 3 పుత్రికా సంతానల వివాహము చేసినారు.వీరిభార్య గతించినతరువాత వీరి పుత్రికలకు  అభిమానము మేరకు కొంత ధనము ఇచ్చి మిగతా ధనము,ఆస్తులపై వొచ్చు ఆదాయాని పూర్తిగా ఈ ధర్మకార్యానికి వినియొగిస్తారు.

  శ్రీరామనామ లేఖనా మహిమలు గురించి అడిగితే చాలు ఎన్నొ ప్రత్యక్ష ఉదాహరణలు : గూడూరు మునిసిపాలిటిలో సకల దురవ్యసనాలకు లొనై ఆతని కుటుంబము చేకూడా ఆసహ్యహించబడ్డ వ్యక్తి రామనామలేఖన వల్ల అతనిలొ వొచ్చిన మార్పు అతని కుటుంబము నుంచి వొచ్చిన ఆదరణతొ హాయిగావున్నడు. రాజమండ్రి లొని ఒక సంపన్నునికి అన్ని వున్నా అతని బిడ్డకు మాటలు రాక ఆ,వూ అని పలుకుతుంటే పడె క్షొభకు పరిహారముగా వీరు రామనామ లేఖనము చేస్తే వీరి బిడ్డ అమ్మా అని పిలిచిన పిలుపుకు వారు పొందిన ఆనందము. తమిళనాడు లొని గుడియాట్టం నుంచి విరి గురించి తెలుసుకొని మర్కాపురమునకు ఒక బస్సులొ వొచ్చి వారు పొందిన ఆనందము. ఇలా ఎన్నొ వున్నాయి. నేడు వీరు సామన్యులకు అవకాశముమేర వున్నాయి ఆ అవకాశములేని ఖైదిలకు తొడ్పాటుగా వుండాలని వరంగల్ ఖైదిలకు పంపితె వొచ్చిన స్పందన.               

ఇవి ఆన్ని పుక్కిటిపురాణాలు కాదు, కల్పనలు అంతకన్నకాదు ప్రత్యక్ష నిదర్శనాలు.
వీరు రామకొటి లేఖనా గ్రంథాలేకాక, ఎన్నొకరపత్రాలు , సుందరకాండ చంపుకావ్యము కూడా పంచుతూనెవున్నారు. మరి వీరిదీ ఆసిధార వ్రతము అవునాకాదా!
మీకు రామనామ లేఖన పై సందేహాలు  వివరణలకు ఉదయము 11గం. తరువాత 9491179822 సంప్రదించగలరు.
 

ఇంతటి విశిష్టమయిన వ్యక్తిని 5సం. క్రితము పరిచయము చేసినవారు మా మిత్రులు శ్రీదేవిశెట్టీ ఆదినారాయణరావు ను ఇక్కడ స్మరించకుండా వుండలేను.
  

       

2 కామెంట్‌లు:

  1. శ్రీ కరమౌ శ్రీ రామ నామం జీవామ్రుత సారం

    పావనమీ రఘురామ నామం భవ తారక మంత్రం

    రా మరా మరా మ రామ

    రా మరా మరా మరామ రామ
    -

    శ్రీ రామ జయం

    ?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు.శ్రీరామ కరుణాకటక్ష ప్రాప్తిరస్తూ...

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.